ATP: రంజాన్ మాసం చివరి జుమా సందర్భంగా గుత్తి కేబీఎన్ మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మసీదు ఇమామ్ హుస్సేన్ ఉపవాసం, దానధర్మాలు, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతపై ప్రసంగించారు. పవిత్ర మాసంలో చేసే నమాజ్, సత్కారాలకు అధిక పుణ్యం లభిస్తుందని వివరించారు. ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో నమాజ్ పూర్తి చేసి ప్రత్యేక దువా నిర్వహించారు.