SDPT: దుబ్బాకలోని ఆర్య వైశ్య భవన్లో నిర్వహించిన అంగన్వాడీ ‘బాల మేళా’లో కాంగ్రెస్ నాయకులు సందడి చేశారు. 19వ వార్డు ఇంఛార్జ్ సిరిసిల్ల సంధ్య నరేష్, మల్లుగారి రామచంద్రారెడ్డి పాల్గొని చిన్నారులకు డ్రెస్ కోడ్ దుస్తులను పంపిణీ చేశారు. పిల్లల సర్వతోముఖాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.