ASR: గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణే లక్ష్యంగా 14ఏళ్లలోపు బాలికలకు ఇచ్చే హెచ్పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమం జిల్లాలో ప్రారంభించినట్లు డీఎంహెచ్వో కృష్ణమూర్తి శుక్రవారం తెలిపారు. పాడేరు బాలికల ఆశ్రమ పాఠశాలలో వ్యాక్సినేషన్ ప్రక్రియను పర్యవేక్షించారు. మహిళలు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ బారిన పడకుండా ఉండేందుకు ఈ వ్యాక్సిన్ రక్షణ కవచంలా పనిచేస్తుందన్నారు.