GDWL: మహిళలు వేధింపులకు గురైతే సంకోచించకుండా షీ టీమ్‌ను సంప్రదించాలని జిల్లా షీ టీమ్ సభ్యురాలు లోకేశ్వరీ పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు గోనుపాడు పాలిటెక్నిక్ కళాశాలలో శుక్రవారం షీ టీమ్ ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఫిర్యాదుల కోసం 8712670312 నంబర్‌కు కాల్ చేయాలని సూచించారు.