GNTR: అమరావతిలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (BITS) పిలాని ఏఐ ప్లస్ క్యాంపస్ నిర్మాణానికి సంబంధించిన ప్లాన్లను మంత్రి నారా లోకేష్ పరిశీలించారు. బిట్స్ ప్రతినిధులు సిద్ధార్థ బెనర్జీ, ఎన్. చెన్నవీర్, బీఎస్ సహాని శుక్రవారం ఉండవల్లి నివాసంలో మంత్రి లోకేష్‌ను కలిసి బిట్స్ ఏఐ క్యాంపస్ ప్లాన్లను ప్రదర్శించారు.