JN: స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో నెలకొన్న ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ వెంకటేశ్వర్లు అన్నారు. ఘన్పూర్లో బీజేపీ ముఖ్య నేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని, కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.