కృష్ణా: ఉయ్యూరు మండలం కాటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతనంగా నిర్మించిన కళావేదికను ఎమ్మెల్యే బోడే ప్రసాద్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐదు దశాబ్దాల చరిత్ర కలిగిన కాటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గ్రామస్తుల సహకారంతో అంచెలంచెలుగా అభివృద్ధి చెందిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.