PPM: విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయాలని జేసీ యశ్వంత్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. విద్యార్థులలో కనీస విద్యా సామర్థ్యాలను పెంపొందించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. స్థానిక డివిఎం ఉన్నత పాఠశాల ఆవరణలో ప్రధానోపాధ్యాయుల స్థాయి సమావేశం శుక్రవారం నిర్వహించారు.