KNR: గన్నేరువరం మండలంలోని కొండాపూర్లో ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం “డ్రై డే ఫ్రైడే” కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలో పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టి చెత్తను తొలగించారు. వర్షాల వల్ల నిల్వ నీటిలో దోమలు పెరిగి వ్యాధులు వచ్చే అవకాశం ఉందని సర్పంచ్ అజయ్ వర్మ తెలిపారు. ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని గ్రామస్తులను కోరారు.