AKP: మాకవరపాలెం మండలం పెద్దిపాలెంలో బీజేపీ ఆధ్వర్యంలో కవయిత్రి మొల్ల జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మొల్ల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామంలోని చేతివృత్తి కార్మికులను కలిసి వారి సమస్యలు, పరిస్థితులను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కేవి. సత్యనారాయణ పాల్గొన్నారు.