NLG: నకిరేకల్‌లోని సాయిబాబా ఆలయ అభివృద్ధికి ఆలయ కమిటీ, భక్తులు సమిష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. సాయిబాబా ఆలయ కమిటీ ఛైర్మన్‌గా ఎన్నికైన తనుకునూరి శ్రీనివాస్, కమిటీసభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని వారిని అభినందించారు. ఆలయంలో మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు.