NGKL: కల్వకుర్తి పట్టణంలోని జేపీ నగర్‌లోని గురుకుల విద్యాలయంను రాష్ట్ర ఫుడ్ కమిషన్ ఛైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి ఇవాళ తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహారం, వంట సరుకులను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి ఆహార నాణ్యత గురించి ఆరా తీశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని పాఠశాల ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు.