నాసా తన ప్రతిష్టాత్మక ‘ఆర్టెమిస్ II మిషన్’ను ఏప్రిల్ 1న ప్రయోగించనుంది. ఇందులో భాగంగా నలుగురు వ్యోమగాములు ఓరియన్ క్యాప్సూల్లో చంద్రుని చుట్టూ 10 రోజులు ప్రదక్షిణ చేసి తిరిగి భూమికి చేరుకుంటారు. ఒకవేళ 1న లాంచ్ సాధ్యం కాకుంటే, ప్రత్యామ్నాయంగా 2-6 తేదీల్లో 4 ప్రత్యామ్నాయ ముహుర్తాలను నాసా సిద్ధం చేసింది. ఈ మిషన్ అంతరిక్ష పరిశోధనల్లో సరికొత్త అధ్యాయంగా నిలవనుంది.