ASF: సిర్పూర్ MLA హరీశ్ బాబు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను శుక్రవారం కలిసి వినతిపత్రం సమర్పించారు. చర్లపల్లి-కాగజ్ నగర్ -నాగపూర్ మీదుగా హౌరా వరకు కొత్త రైలును మంజూరు చేయాలని కోరారు. కాగజ్ నగర్, చంద్రాపూర్ ప్రాంతాల్లోని బెంగాలీ ప్రజలకు ఈ రైలు ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు. రైల్వే బోర్డు ఛైర్మన్ సతీశ్ కుమార్‌కు ప్రతిపాదనలు అందజేశారు.