పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మార్చి 19న విడుదల కానుంది. తాజాగా విడుదలైన ‘కాలరే ఎత్తారా’ సాంగ్‌కు మంచి స్పందన వస్తోంది. ఈ పాట లాంచ్ ఈవెంట్లో నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ.. మార్చి 15న హైదరాబాద్‌లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో గ్రాండ్‌గా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు ప్రకటించి ఫ్యాన్స్‌లో జోష్ నింపాడు.