SRD: గ్రామాల్చేలో చేపట్టనున్న రీ- సర్వే ద్వారా రైతుల సమస్యలు పరిష్కృతం అవుతాయని డిస్ట్రిక్ట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ బిక్షపతి అన్నారు. ఇవాళ సిర్గాపూర్ మండలం ఖాజాపూర్ గ్రామ సభలో మాట్లాడుతూ.. భూమి కబ్జాలో ఉన్న రైతుకు ఎలాంటి డోకా లేదని భరోసా ఇచ్చారు. గ్రామానికి రెవెన్యూ నక్షా లేదని, త్వరలో ఇక్కడ భూ రీ సర్వే చేసి ఆన్లైన్లో నమోదు చేస్తామని తెలిపారు.