TPT: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం, బ్యాక్లాగ్ విద్యార్థులకు ఫిజిక్స్ పేపర్–II పరీక్ష శుక్రవారం జిల్లాలోని 84 కేంద్రాల్లో నిర్వహించారు. మొత్తం 24,313 మంది విద్యార్థులకు గాను 23,978 మంది హాజరుకాగా 335 మంది గైర్హాజరయ్యారు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణతో పాటు త్రాగునీరు, మెడికల్ సిబ్బంది ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.