NTR: స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా తిరువూరులో ఎంపీడీవో కార్యాలయం వేదికగా చెత్త సేకరణ రిక్షాలను, డస్ట్ బిన్లను స్థానిక ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు శుక్రవారం పంపిణీ చేశారు. చెత్త సేకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేయడానికి ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పించడానికి ఈ పరికరాలు ఎంతగానో దోహదపడతాయని ఎమ్మెల్యే అన్నారు.