E.G: అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో గ్యాస్ కొరత ఏర్పడుతుందనే ఆందోళనతో ప్రజలెవరూ అనవసరంగా సిలిండర్లను నిల్వ చేసుకోవద్దని రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ఎలాంటి అంతరాయం కలగకుండా సివిల్ సప్లయిస్ అధికారులు, డీలర్లతో చర్చిస్తున్నామని తెలిపారు. గ్యాస్ బుకింగ్‌కి ప్రత్యామ్నాయ నెంబర్లు తీసుకొస్తామని పేర్కొన్నారు.