NRPT: నర్వ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉరివేసుకున్న ఓ యువకుడిని అత్యవసర చికిత్స కోసం తీసుకురాగా, సరైన స్పందన లేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యాన్లు పని చేయకపోవడం, డాక్టర్ ఫోన్ ఎత్తకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నర్స్ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని బాధితులు ఆరోపించారు.