SDPT: అక్బర్పేట – భూంపల్లి మండలం బొప్పాపూర్ గ్రామంలో స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేయనున్నట్లు సర్పంచ్ మాధవనేని భాను ప్రసాద్ తెలిపారు. మంగళవారం డ్వాక్రా మహిళా సంఘాలతో నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మహిళల ఆర్థికాభివృద్ధిని కాంక్షిస్తూ స్టీల్ బ్యాంక్ మరియు టెంట్ హౌస్ నిర్వహణ బాధ్యతలను మహిళా సంఘాలకే అప్పగిస్తున్నట్లు వెల్లడించారు.