TG: మావోయిస్టు అగ్రనేత రామచంద్రారెడ్డి అంత్యక్రియలకు హాజరైన 230 మంది మాజీ మావోయిస్టులకు NIA ఇటీవల నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో తీవ్ర కలవరం మొదలైంది. ఈ క్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఇన్నయ్యతోపాటు మరికొందరిపై దేశద్రోహం కేసులు నమోదవగా.. వీటి దర్యాప్తు కోసమే మాజీ మావోయిస్టులకు నోటీసులు జారీ చేశారని వెల్లడవుతోంది.