ఇటీవల వివాహం చేసుకున్న నటుడు అల్లుశిరీష్ దంపతులను ఏపీ సీఎం చంద్రబాబు ఆశీర్వదించిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పందించాడు. ‘మీరు మా ఇంటికి వచ్చిన సమయంలో నేను లేను. క్షమించండి.. నేను విదేశాల్లో ఉన్నాను. కానీ మీతో ఫోన్లో మాట్లాడటం నాకు సంతోషంగా ఉంది. కొత్త జంటకు మీ ఆప్యాయత, ఆశీర్వాదాలకు మేము నిజంగా కృతజ్ఞులం’ అని ‘X’లో రాసుకొచ్చారు.