NLR: కలిగిరి మండలం పెదపాడు సమీపంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురుగా వస్తున్న బైకును టాటా మ్యాజిక్ వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై వెళుతున్న రత్నరాజు(40) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు ప్రకాశం జిల్లా విలపర్ల వాసిగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలను సేకరిస్తున్నారు.