ATP: రాప్తాడు రైల్వే ఓవర్ బ్రిడ్జిని ఎమ్మెల్యే పరిటాల సునీత ఆదివారం ప్రారంభించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రూ.25 కోట్ల నిధులు రాబట్టి కేవలం ఎనిమిది నెలల్లోనే నిర్మాణం పూర్తి చేయించారు. ఈ బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో బెంగళూరు, హైదరాబాద్, చెన్నై జాతీయ రహదారుల ప్రయాణికులకు గంటల తరబడి వేచి చూసే ఇబ్బందులు తప్పాయి.