GDWL: రాజోలి మండల కేంద్రంలో టమాటా రైతులకు తీవ్ర అన్యాయం జరిగింది. ఆదివారం మార్కెట్ లో కిలో టమాటా కేవలం రూ. 5 నుంచి రూ. 10 పలుకుతుండటంతో, రవాణా ఖర్చులు కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో విసిగిపోయిన కొందరు రైతులు తమ పంటను మార్కెట్కు తీసుకెళ్లకుండా, మండల కేంద్రంలోని బ్రిడ్జిపై పారబోసి కోతులకు ఆహారంగా వదిలి వెళ్లారు.