NLR: టీటీడీ పదవికి బీఆర్ నాయుడు వెంటనే రాజీనామా చేయాలని వైసీపీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత డిమాండ్ చేశారు. శనివారం నెల్లూరు మాగుంట లే ఔట్ లోని ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని పూజలు నిర్వహించినట్లు తెలిపారు. రాసలీలలు చేస్తూ భక్తుల మనోభావాలు కించపరుస్తున్న బీఆర్ నాయుడిని తొలగించాలని డిమాండ్ చేశారు.