GNTR: ప్రత్తిపాడు ఎమ్మెల్యే డా.బూర్ల రామాంజనేయులు 40, 27వ డివిజన్ల అభివృద్ధిపై సమీక్షించారు. అధికారులు, ప్రజాప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. డివిజన్ల అభివృద్ధే కూటమి ప్రభుత్వ ధ్యేయమన్నారు. జరుగుతున్న పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఇంకా జరగాల్సిన పనులకు ప్రాధాన్యతనిచ్చి, వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.