SRPT: క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని ఏఐసీసీ సభ్యుడు సర్వోత్తమ్ రెడ్డి అన్నారు. శనివారం సూర్యాపేటలో రాష్ట్రస్థాయి 8వ టోర్నమెంట్ క్రీడలను ప్రారంభించి మాట్లాడారు. క్రీడలతో స్నేహ సంబంధాలు పెంపొందుతాయని, ప్రతీ ఒక్కరు క్రీడలు, వ్యాయామాన్ని జీవితంలో భాగంగా చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్పర్సన్ నివేదిత, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.