JN: దేవరుప్పుల మండల ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా సింగరాజుపల్లి గ్రామ ఉపసర్పంచ్ జోగు అనిల్ నియమితులయ్యారు. జనగాం జిల్లా ఉపసర్పంచ్ ఫోరం అధ్యక్షులు పండుగ హరీష్ నియమాక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ.. ఫోరం బలోపేతానికి కృషి చేస్తూ ప్రతి ఉపసర్పంచ్ సమస్యను పరిష్కరించే దిశగా కట్టుబడి పని చేస్తానని స్పష్టం చేశారు.