ADB: కాంగ్రెస్ ప్రభుత్వం ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. ఈనెల 29న ఇందిరా పార్క్ వద్ద జేఏసీ చేపట్టనున్న మహా ధర్నా పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఉద్యోగులు ఐక్యంగా పోరాడాలని పిలుపునిస్తూ, వారి సమస్యల పరిష్కారానికి తన పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు.