NGKL: సీఎం సహాయ నిధి పథకం ద్వారా పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు మంజూరైన సీఎం సహాయనిధి చెక్కులను ఆదివారం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు.