తన సినీ కెరీర్లోని ఒక చేదు అనుభవాన్ని నటి లావణ్య త్రిపాఠి పంచుకుంది. కరోనా సమయంలో ఒక తమిళ సినిమాకు సంతకం చేశానని, అయితే షూటింగ్ సెట్లో దర్శకుడి ప్రవర్తన అస్సలు నచ్చలేదని ఆమె తెలిపింది. అక్కడ తనకు భద్రత లేదని, తీవ్ర అసౌకర్యంగా అనిపించడంతో ఆ ప్రాజెక్ట్ నుంచి తక్షణమే తప్పుకున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం ఈ కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి.