SRPT: ప్రజల భద్రతకు పెద్దపీట వేస్తామని నాగారం ఎస్సై చిరంజీవి అన్నారు. ఆదివారం ఫణిగిరి-ఈటూరు క్రాస్ రోడ్డు వద్ద వాహనదారుల సౌకర్యార్థం అవుట్డోర్ ఎల్ఈడీ ఫ్లడ్లైట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. గంజాయి నివారణకు ప్రజాప్రతినిధులు సహకరించాలని SI కోరారు.