NLR: బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని పదవ తరగతి పరీక్షల కేంద్రాలను మండల విద్యాశాఖ అధికారి-2 రత్నం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని 7 పరీక్ష కేంద్రాల్లో 1041 విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని చెప్పారు. ఈనెల 16 నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు జరుగుతాయని తెలిపారు. విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.