ఆదిలాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్ మూల్యాంకన ప్రక్రియ ఆదివారం ప్రారంభమైంది. డీఐవో జాధవ్ గణేష్ కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించి, సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ప్రతిరోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. అధ్యాపకులు సమయపాలన పాటిస్తూ, మూల్యాంకనంలో జాగ్రత్తలు వహించాలని సూచించారు.