KDP: ఆపదలో ఉన్న పేద, మధ్య తరగతి కుటుంబాలకు అండగా నిలవడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ ఇంఛార్జ్ బీటెక్ రవి పేర్కొన్నారు. ఆదివారం టీడీపీ కార్యాలయంలో 38 మంది లబ్దిదారులకు రూ. 21,88,769 విలువైన చెక్కులను ఆయన స్వయంగా బాధితుల కుటుంబాలకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్య ఖర్చుల భారం తట్టుకోలేని నిరుపేదలకు CMRF సంజీవని అని అన్నారు.