SRD: ఖేడ్ మండలం హనుమంతరావు పేట గ్రామంలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి జాతర మహోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు బుధవారం ఆలయ వద్ద ఏర్పాట్లు చేశారు. గురువారం ఉదయం శ్రీవారికి అభిషేకం, పూజలు, సాయంత్రం బండ్ల ప్రదర్శన ఉంటుంది. అలాగే రాత్రి శ్రీ మల్లికార్జున స్వామి జీవిత చరిత్ర పౌరాణిక నాటకం మొదటి భాగం ప్రారంభమవుతుందని ఆలయ ఛైర్మన్ అర్కల అనంతయ్య తెలిపారు.