మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని 37వ డివిజన్ నివాసి పరశురాం హైదరాబాద్ టి.ఎక్స్ ఆస్పత్రిలో అనారోగ్య కారణాలతో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ ఆసుపత్రికి చేరుకుని గురువారం ఆయనను పరామర్శించారు. మెరుగైన చికిత్సను అందించాలని అక్కడ వైద్యులకు సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మున్నూరు రాజు పాల్గొన్నారు.