MDK: తూప్రాన్ పట్టణంలో రేపటి నుంచి పదవ తరగతి పరీక్షలు జరగనున్నందున విద్యుత్ సమస్యలు తలెత్తకుండా విద్యుత్ అధికారులను నియమించినట్లు విద్యుత్ శాఖ ఏఈ వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. తూప్రాన్ లైన్ ఇన్స్పెక్టర్లు సహదేవ్, బాలయ్య ఆధ్వర్యంలో ఒక్కొక్క పాఠశాలకు ఒక్కొ విద్యుత్ అధికారిని నియమించినట్లు పేర్కొన్నారు. దీంతో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగవన్నారు.