VSP: ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం వరాహలక్ష్మి నృసింహస్వామి వారి వార్షిక కళ్యాణ మహోత్సవం ఈనెల 29న జరగనుంది. ఈ సందర్భంగా స్వామివారికి ఇవాళ సాయంత్రం 3:30 గంటలకు పెళ్లి రాట మహోత్సవం నిర్వహించనున్నారు. సంప్రదాయబద్ధంగా వైదిక క్రతువులు పూర్తిచేసి భక్తుల గోవింద నామస్మరణ, మేళతాళాల మధ్య రాట ఉడుపు మహోత్సవాన్ని నిర్వహిస్తారు.