PLD: నరసరావుపేట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండు వద్ద పల్నాడు యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన ఆటో స్టాండ్‌ను ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్లు సమాజానికి కీలక భాగస్వాములని, వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.