ప్రకాశం: పామూరులోని మదన వేణుగోపాల స్వామి ఆలయంలో గురువారం ఉగాది పరాభవనామ సంవత్సరాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు నారాయణ చార్యులు, ఈవో గిరిరాజు నర్సింహబాబు ఆలయంలో పంచాంగాలు ఆవిష్కరించడంతో పాటు చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.