KRNL: కోడుమూరులో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని హంద్రీనది ఒడ్డున ఉన్న వల్లెలాంబాదేవి ఆలయంలో ఈనెల 18 నుంచి 20 వరకు అమ్మవారి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు జడ్పీటీసీ సభ్యుడు రఘునాథ్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆలయ కమిటీ సభ్యులతో కలిసి ఉత్సవాల కరపత్రాలను విడుదల చేశారు. 18న గోపూజ, గణపతి పూజలు, 19న రథోత్సవం, 20న పారువేటతో ఉత్సవాలు ముగుస్తాయన్నారు.