WGL: వర్ధన్నపేట, పర్వతగిరి, వరంగల్ మండలాలకు చెందిన 27 మంది లబ్ధిదారులకు 50 శాతం సబ్సిడీపై పనిముట్లను ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పంపిణీ చేశారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ యంత్రికరణకు ప్రాధాన్యత ఇస్తున్నాయని, రైతులు పంటల సాగులో మెలకువలు పాటించి అధిక దిగుబడులు పొందాలని ఎమ్మెల్యే అన్నారు.