SRD: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధి చిట్కుల్ గ్రామంలో శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం వార్షికోత్సవంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూతన దేవాలయాల నిర్మాణాలకు సహకారం అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, స్థానిక నాయకులు, కౌన్సిలర్లు, గ్రామ పెద్దలు ఉన్నారు.