ADB: ఉట్నూర్ మండలం లాల్ టెక్డిలోని ప్రభుత్వ గిరిజన గురుకుల బాలుర పాఠశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని DIEO గణేష్ శుక్రవారం తనిఖీ చేశారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా గదుల్లో వసతులు కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు. పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించి పలు సూచనలు చేశారు.