KMM: రాష్ట్రంలో ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. శుక్రవారం తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. 3 సంవత్సరాలలో పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు.