JGL: పేద ప్రజలకు వరం కల్యాణ లక్ష్మీ పథకం అని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల రూరల్, అర్బన్ మండలాలకు చెందిన 10 మంది ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి పథకం కింద మంజూరైన రూ. 10 లక్షలు విలువ చేసే చెక్కులను శుక్రవారం ఆయన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నందయ్య, మున్సిపల్ ఛైర్ పర్సన్ వాణి, తహసీల్దార్ రామ్మోహన్, నాయకులు పాల్గొన్నారు.