NTR: తిరువూరు సబ్ డివిజన్ పరిధిలో ఈనెల 16వ తేదీ నుంచి జరిగే 10వ తరగతి పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా, తిరువూరు-5, గంపలగూడెం-5, విస్సన్నపేట-5, రెడ్డిగూడెం-2, ఏ కొండూరు-2 మండలాలు కలిపి 19 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. ఈ పరీక్షా కేంద్రాలలో 3505 మంది విద్యార్థులు హాజరుకానున్నారని తెలిపారు.